" Dakamarri.Com " మా వెబ్ సైట్ ప్రారంభించటానికి కారణం వెబ్ ప్రపంచంలో మరొక వెబ్ సైట్ పెంచటం కాదు. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉండి ఇంకా అభివృది చెందకుండా, అట్టడుగున ఉన్న ఈ ఊర్లో పుట్టి బ్రతకాలంటే విజయవాడకో , వైజాగ్ కో వలస వెళ్లి సొంత ఊరితో సంబంధం లేక ఎంత ఎదిగిన, మనసున మన ఊరికి దూరం అయ్యారన్న భావనలో నిరాశకు గురి అవుతున్న మన వారి కోసం , మన అభివృది కి కొత్త దారులు కోసం , కొత్త అవకాశాల కోసం మన మధ్య కొత్త వారధిని నిర్మిస్తున్నాం. అదే Dakamarri.Com (దాకమర్రి డాట్ కామ్)
దాకమర్రి : -
భారతదేశంలో ఉన్న కొన్ని వేల గ్రామాలలో దాకమర్రి ఒకటి మరి దాకమర్రి కి ఒక సొంత చరిత్ర ఉంది.భారత సంస్కృతిలో ఉన్న భిన్నత్వం భావనలో ఏకత్వంకు దీన్ని సాద్యం చేసింది.
గ్రామీణ భారతంలో దాకమర్రికి ఉన్న ప్రాదాన్యతను ప్రపంచం గుర్తించాలి అనే మా ప్రయత్నం ...
పూర్వం ఈ ప్రాంతంలో దక్షప్రజాపతి అయిన దక్షుడు వైభవోపేతంగా యజ్ఞం చేయదలచి యజ్ఞానికి సకల దేవతలను పిలిచి తన కూతురైన సతిదేవిని ఆమె పతి శివుడిని ఆహ్వానించలేదు. అయినను సతీదేవి జన్మనిచ్చిన తండ్రి కొరకు శివుడు మాట కాదని యజ్ఞానికి వెళ్ళింది.అక్కడ దక్షుడు తన కూతురు సతీదేవిని అవమానించాడు. ఈ అవమానం కారణంగా సతీదేవి తండ్రి కళ్ళ ముందు ప్రాణ త్యాగం చేసింది. ఈ విషయం తెలుసుకున్న శివుడు ఉగ్రరూపం దాల్చి వీరభద్రునిగా దక్ష ప్రజాపతిని వదించాడు. నాటి నుండి ఈ ప్రాంతం ఉగ్రరూపంగా మారింది. శాంతి కొరకు విష్ణువు ఇక్కడ శ్రీ లక్ష్మి వల్లభ నారాయణ స్వామి వారిగా అవతరించి ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండేటట్లు అనుగ్రహించారు. దక్షయజ్ఞ భంగం జరిగిన ప్రదేశం కావున దక్షమారి అని పిలవబడి కాలాంతరంలో దాకమర్రిగా రూపాంతరం చెందింది.
గ్రామ చరిత్ర : -
దాకమర్రి సుమారు 3000 ఏళ్ళ చరిత్ర కలిగి ఉంది. నాటి నుండి ఈ ఊరి పేరు దాకమర్రి (దక్షమర్రి ) గానే ఉంది. చరిత్రలో ఇది అతి గొప్ప అరుదైన విషయం. కాల గమనంలో నాగరికత మార్పులకు పేర్లు మారుతూ ఉంటాయి కానీ మారలేదు. ఇదే విషయం ఇక్కడ లక్ష్మి వల్లభ నారాయణ స్వామి వారి ఆలయంలో లభ్యమైన శిలా శాసనం వలన తెలుస్తుంది. అంతే కాకుండా ఇక్కడ ఒక రాయి పైన కమల పువ్వు గుర్తు ప్రకారం ఈ గ్రామం అశోకుని కాలం నాటికి ఉండి పశ్చిమం నుండి వచ్చే వర్తకులకు వ్యాపార కూడలిగా ఉండేదని దీని ద్వారానే తూర్పు దేశాలలో గోపాలపట్నం (నేటి విశాఖపట్నం) , భీమునిపట్నం ఓడరేవులు ద్వారా వ్యాపారం జరిగేదని తెలుస్తుంది.
శ్రీ లక్ష్మి వల్లభ నారాయణ స్వామి వారి ఆలయంలో శిలా శాసనం , నిర్మాణ శైలి పరిశిలించి పరిశోదన జరిపిన ఆంద్ర యూనివర్సిటీ A.U. ఆచార్యులు ఈ గ్రామంలో ప్రముఖ శైవ క్షెత్రంగా ఉండినది అని 1071 సంవత్సరంలో చోళ నిర్మాణ శైలిలో నిర్మాణం జరిగిన ఆలయం 1071 న ఉన్నతి పొంది తదుపరి ఏ కారణం చేతనో అంతర్దానం అయినది.
ఈ అంతర్దానం వెనుక తదుపరి వచ్చిన శ్రీ వైష్ణవం ప్రభావం ఉందని కచ్చితంగా చెప్పలేమని ఎందుకంటే 1071 సంవత్సరంలోని శ్రీ లక్ష్మి వల్లభ నారాయణ స్వామి వారి ఆలయంకి కూడా అదే దాత దానం జరిపారని తమిళనాడు మాదిరి ఇక్కడ శైవ , వైష్ణవ మత ఘర్షణలు కానరావు అని మత సామరస్యం ఉండినది అని కచ్చితంగా చెప్పవచ్చు.
దాకమర్రి గ్రామంలో పురాతన శైవ దేవాలయం కనుమరుగు అయ్యి ఆ శివలింగ రూపంలో ( శ్రీ దాకమర్రి దాక్షయణ మహాదేవర ) ప్రస్తుతం దాకమర్రి రెవిన్యూ పరిధిలోని మజ్జిపేట గ్రామంలో పుజాదికాలను అందుకొనుచున్నారు.
ఇక్కడ శ్రీ లక్ష్మి వల్లభ నారాయణ స్వామి వారి ఆలయం పునరుద్దరింపబడి ఇక్కడ నిత్య పూజలు జరుగుతున్నాయి.
ఈ ఆలయాల శిధిలం 1360 సంవత్సరంలో జరిగిన తురస్కుల దండయాత్ర కారణం కావచ్చు అని ఎందుకంటే 1360 - 1475 వరకు సరైన పాలకుడు ఈ ప్రాంతంలో లేకపోవటం కారణం కావచ్చు.
నాటి చరిత్ర : -
తురస్కుల దాడుల అనంతరం కూడా సుమారు 140 కుటుంబాల వరకు వైష్ణవులు ఉండేవారని రెండు వీధులుగా మిద్దె పూరిళ్ళు ఉండేవని వారి కుటుంబాలలో పెద్ద కుటుంబం అయిన " పైడిపాటి " లక్ష్మి వల్లభ నారాయణాచార్యుల కుటుంబీకులు వద్ద అనేక తాళపత్ర గ్రంధాలు ఉండేవని అవన్నీ 1850 - 1870 మద్య జరిగిన అగ్ని ప్రమాదం వలన నసించినవి అని తెలుస్తుంది.
వారే కాక భక్తి గీతాల ద్వారా వైష్ణవ మత ప్రచారం నిర్వహించే దాసుర్లు కూడా ఉండేవారు. వారు ఆలయం మూత పడిన తరువాత గ్రామ శివారులో ఉన్న నేటి దాసరిపేటకు అక్కడ నుండి S.కోట తదితర ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు.
తరువాత 1750 ప్రాంతంలో శ్రీకాకుళం , ఒరిస్సా , మహారాష్ట్రల నుండి నాగావంశీయులు వచ్చి దాకమర్రికి తిరిగి ప్రాభను తీసుకొనివచ్చారు.
మీ యెక్క విలువైన సలహాలను , సమాచారాన్ని మాకు తెలియజేయండి.
మెయిల్ ఐడి : Durgarao@dakamarri.com

No comments:
Post a Comment