దాకమర్రి పండగలు : ఊరి పండగ
దాకమర్రి గ్రామం విజయనగరం జమిందారు వారి ఏలుబడిలో ఉండేది. 1757 సంవత్సరంలో జరిగిన బొబ్బిలియుద్ధంలో అటు బొబ్బిలి వంశం , ఇటు విజయనగర రాజులు ఇరువురు హతమైనప్పుడు విజయనగర రాజు అయినటువంటి విజయరామరాజు సోదరి పైడిమాంబ తమ రాజ్యం ఫ్రెంచ్ వారి హస్తగతం అవ్వడం ఇష్టపడక పరాయి రాజ్యం లో తను జీవించటానికి మనసును చంపుకొని, జీవించలేక తను నిత్యం ఆరాదించే విజయవాడ కనకదుర్గ లో కలిసిపోయి విజయనగరంలోని పెద్ద చెరువులో బంగారు విగ్రహరూపంలో వెలసింది. నాటి నుండి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రజలు ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటుంది.
ఆ రోజు నుండి విజయనగరం సంస్థానంలో భక్తులు కోర్కెలను తీరుస్తూ, భక్తుల పాలిట కొంగు బంగారంగా పూజలు అందుకుంటూ దాకమర్రి నుండి కూడా ప్రతి సంవత్సరం ప్రజలు 7 పెద్ద కుటుంబాల 7 ఎడ్ల బళ్ళను అందంగా అలంకరించి ఆ తల్లికి మొక్కులు తీర్చుకోడానికి వెళ్ళి వచ్చేవారు. కాలక్రమంగా విజయనగరంలో స్వాతంత్ర్యనికి ముందు బ్రిటీష్ వారు పండగలు నిర్వహణ వలన ప్రజలలో ఐక్యమత్యం పెరుగుతుందని, తిరుగుబాట్లు జరగవచ్చని కారణంతో ప్రజల రాకపోకలు నియంత్రించారు. రాకపోకలకు ఇబ్బంది కల్గించిన కారణంతో ప్రజలు తమ మొక్కులు తీర్చుకోడానికి అనేక ఇబ్బందులకు గురి అయ్యేవారు. ఆ తల్లి కరుణ మీరు మీ మ్రొక్కులను మీ గ్రామంలో నుండి తీర్చుకోండి అని చెప్పి చైత్ర మాసంలో పౌర్ణమి ఘడియలలో సోమ , మంగళ , బుధ వారాలలో మీ 7 బళ్ళను రధాలుగా మీ ఊరు చుట్టూ ప్రదక్షణగా ఊరి మధ్యలో గుడి కట్టి ఊరికి నైరుతిన శక్తి పీటం (సదురు) (వనం గుడిని) మీ స్థాయిలో ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం ఉత్సవాలు నిర్వహించుకోవచ్చు అని ఆనతిని ఇవ్వగా నాటి నుండి ఊరు జమిందారులు అయిన నాయిడోరు ఆధ్వర్యంలో పండుగలు జరుగగా 7 పెద్ద కుటుంబాలు సమక్షంలోని
1 కాళ్ళ
పండగ లో మొదటి ఘటం , మొదటి రధం , మొదట బాలి ఇచ్చే పోతూ ఇలా అన్ని సందర్బాలలో మొదటిది కాళ్ళ వారిదే కావడం విశేషం.
2 మొకర
3 కంటుభుక్త + బక్క
4 రంగుబుక్త
5 సంకురుభుక్త
6 కంటుభుక్త
7 ముద్దాడ
రధాలను వేరు వేరు రూపాలలో అలంకరించి ఆ తల్లికి తమ మొక్కులను తీర్చుకొని ఆ తల్లి తీర్ధ ప్రసాదాలను భక్తులకు అందించి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి పండుగ 30 రోజులు ముందుగ చాటింపు వేసి, 15 రోజులు ముందుగా వనం గుడికి భక్తులు ఊరేగింపుగా వెళ్ళి దివిటీల వెలుగులో అమ్మవారిని ఊరేగింపుగా భక్తులు ప్రధాన ఆలయానికి తీసుకొని వస్తారు. అమ్మ వారు ఉగాది పండగ రోజున పంచగా శ్రవణం చేసిన తర్వాత భక్తులను తరింపచేయడానికి వంది మగాదులు వెంట పెట్టుకొని ఊరేగింపుగా దాకమర్రి గ్రామ అనుబంద గ్రామాలకు జోగిగా వెళ్ళి పాడిపంటలను, పిల్లలను నాడు దుర్గలో ఐక్యం కాక మునుపు పైడిమాంబ నడియాడిన ప్రదేశాలను ఆమెకు చూపిస్తూ సాయంత్రానికి సతకం (రచ్చబండ) వద్దకు చేరి ప్రజలు వారు ప్రవర్తిస్తున్న తీరుపై వాలకాలు వ్యంగ్యంగా విమర్శలు ఉంటాయి. ఈ విధంగా పౌర్ణమి దగ్గరి సోమవారం తోలెలు (అనగా మొదటి పూజను) 7 రధాలను ఒక్కసారి తిప్పి నిర్వహణ చేస్తారు. రెండవ రోజైన మంగళవారం ప్రధాన పూజను నిర్వహించి సాయంత్రం ప్రజలు ఘటాలతో పాటు, 7 రధాలు (3 సార్లు ) , పాలధార (సైన్యం)తో ఊరు మొత్తం తిరిగి ప్రధాన ఆలయంకు చేరుస్తారు. తదుపరి 15 రోజులు తరువాత అమ్మవారి అనుపు (ఉయ్యాల కంబాల) నిర్వహణతో పండగ ముగుస్తుంది.
గత 20 ఏళ్ళుగా పండుగను నాయిడోరుతో పాటు గ్రామ పెద్దగా ఉన్న చెల్లూరి పైడప్పడు గారు కలిసి నిర్వహిస్తున్నారు.
నాటి నుండి పండుగను నేటి వరకు ప్రజలు తమ జీవనార్ధం ఎచ్చటకు వెళ్ళిన ఆ మూడు రోజులు తమ ఇళ్ళకు వచ్చి భక్తి శ్రద్ధలతో , ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకుంటారు.

Dakamarri కీర్తి ని ఇలా online లో రాసి నీ వంతు సహకారం చేస్తున్నావు నీవు ఇంకా ఇలాగే ఎదగాలని నీతో ఉన్నవారిని ఆదుకుంటు సాగిపో.. By #lvnteam
ReplyDeleteదాకమర్రి : -
ReplyDeleteభారతదేశంలో ఉన్న కొన్ని వేల గ్రామాలలో దాకమర్రి ఒకటి మరి దాకమర్రి కి ఒక సొంత చరిత్ర ఉంది.భారత సంస్కృతిలో ఉన్న భిన్నత్వం భావనలో ఏకత్వంకు దీన్ని సాద్యం చేసింది.
గ్రామీణ భారతంలో దాకమర్రికి ఉన్న ప్రాదాన్యతను ప్రపంచం గుర్తించాలి అనే మా ప్రయత్నం ...
పూర్వం ఈ ప్రాంతంలో దక్షప్రజాపతి అయిన దక్షుడు వైభవోపేతంగా యజ్ఞం చేయదలచి యజ్ఞానికి సకల దేవతలను పిలిచి తన కూతురైన సతిదేవిని ఆమె పతి శివుడిని ఆహ్వానించలేదు. అయినను సతీదేవి జన్మనిచ్చిన తండ్రి కొరకు శివుడు మాట కాదని యజ్ఞానికి వెళ్ళింది.అక్కడ దక్షుడు తన కూతురు సతీదేవిని అవమానించాడు. ఈ అవమానం కారణంగా సతీదేవి తండ్రి కళ్ళ ముందు ప్రాణ త్యాగం చేసింది. ఈ విషయం తెలుసుకున్న శివుడు ఉగ్రరూపం దాల్చి వీరభద్రునిగా దక్ష ప్రజాపతిని వదించాడు. నాటి నుండి ఈ ప్రాంతం ఉగ్రరూపంగా మారింది. శాంతి కొరకు విష్ణువు ఇక్కడ శ్రీ లక్ష్మి వల్లభ నారాయణ స్వామి వారిగా అవతరించి ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండేటట్లు అనుగ్రహించారు. దక్షయజ్ఞ భంగం జరిగిన ప్రదేశం కావున దక్షమారి అని పిలవబడి కాలాంతరంలో దాకమర్రిగా రూపాంతరం చెందింది.
గ్రామ చరిత్ర : -
దాకమర్రి సుమారు 3000 ఏళ్ళ చరిత్ర కలిగి ఉంది. నాటి నుండి ఈ ఊరి పేరు దాకమర్రి (దక్షమర్రి ) గానే ఉంది. చరిత్రలో ఇది అతి గొప్ప అరుదైన విషయం. కాల గమనంలో నాగరికత మార్పులకు పేర్లు మారుతూ ఉంటాయి కానీ మారలేదు. ఇదే విషయం ఇక్కడ లక్ష్మి వల్లభ నారాయణ స్వామి వారి ఆలయంలో లభ్యమైన శిలా శాసనం వలన తెలుస్తుంది. అంతే కాకుండా ఇక్కడ ఒక రాయి పైన కమల పువ్వు గుర్తు ప్రకారం ఈ గ్రామం అశోకుని కాలం నాటికి ఉండి పశ్చిమం నుండి వచ్చే వర్తకులకు వ్యాపార కూడలిగా ఉండేదని దీని ద్వారానే తూర్పు దేశాలలో గోపాలపట్నం (నేటి విశాఖపట్నం) , భీమునిపట్నం ఓడరేవులు ద్వారా వ్యాపారం జరిగేదని తెలుస్తుంది.
శ్రీ లక్ష్మి వల్లభ నారాయణ స్వామి వారి ఆలయంలో శిలా శాసనం , నిర్మాణ శైలి పరిశిలించి పరిశోదన జరిపిన ఆంద్ర యూనివర్సిటీ A.U. ఆచార్యులు ఈ గ్రామంలో ప్రముఖ శైవ క్షెత్రంగా ఉండినది అని 1071 సంవత్సరంలో చోళ నిర్మాణ శైలిలో నిర్మాణం జరిగిన ఆలయం 1071 న ఉన్నతి పొంది తదుపరి ఏ కారణం చేతనో అంతర్దానం అయినది.
ఈ అంతర్దానం వెనుక తదుపరి వచ్చిన శ్రీ వైష్ణవం ప్రభావం ఉందని కచ్చితంగా చెప్పలేమని ఎందుకంటే 1071 సంవత్సరంలోని శ్రీ లక్ష్మి వల్లభ నారాయణ స్వామి వారి ఆలయంకి కూడా అదే దాత దానం జరిపారని తమిళనాడు మాదిరి ఇక్కడ శైవ , వైష్ణవ మత ఘర్షణలు కానరావు అని మత సామరస్యం ఉండినది అని కచ్చితంగా చెప్పవచ్చు.
దాకమర్రి గ్రామంలో పురాతన శైవ దేవాలయం కనుమరుగు అయ్యి ఆ శివలింగ రూపంలో ( శ్రీ దాకమర్రి దాక్షయణ మహాదేవర ) ప్రస్తుతం దాకమర్రి రెవిన్యూ పరిధిలోని మజ్జిపేట గ్రామంలో పుజాదికాలను అందుకొనుచున్నారు.
ఇక్కడ శ్రీ లక్ష్మి వల్లభ నారాయణ స్వామి వారి ఆలయం పునరుద్దరింపబడి ఇక్కడ నిత్య పూజలు జరుగుతున్నాయి.
ఈ ఆలయాల శిధిలం 1360 సంవత్సరంలో జరిగిన తురస్కుల దండయాత్ర కారణం కావచ్చు అని ఎందుకంటే 1360 - 1475 వరకు సరైన పాలకుడు ఈ ప్రాంతంలో లేకపోవటం కారణం కావచ్చు.
నాటి చరిత్ర : -
తుష్కురల దాడుల అనంతరం కూడా సుమారు 140 కుటుంబాల వరకు వైష్ణవులు ఉండేవారని రెండు వీధులుగా మిద్దె పూరిళ్ళు ఉండేవని వారి కుటుంబాలలో పెద్ద కుటుంబం అయిన " పైడిపాటి " లక్ష్మి వల్లభ నారాయణాచార్యులు కుటుంబీకులు వద్ద అనేక తాళపత్ర గ్రంధాలు ఉండేవని అవన్నీ 1850 - 1870 మద్య జరిగిన అగ్ని ప్రమాదం వలన నసించినవి అని తెలుస్తుంది.
వారే కాక భక్తి గీతాల ద్వారా వైష్ణవ మత ప్రచారం నిర్వహించే దాసుర్లు కూడా ఉండేవారు. వారు ఆలయం మూత పడిన తరువాత గ్రామ శివారులో ఉన్న నేటి దాసరిపేటకు అక్కడ నుండి S.కోట తదితర ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు.
తరువాత 1750 ప్రాంతంలో శ్రీకాకుళం , ఒరిస్సా , మహారాష్ట్రల నుండి నాగావంశీయులు వచ్చి దాకమర్రికి తిరిగి ప్రభను తీసుకొనివచ్చారు.