దాకమర్రి పండగలు : ఊరి పండగ
దాకమర్రి గ్రామం విజయనగరం జమిందారు వారి ఏలుబడిలో ఉండేది. 1757 సంవత్సరంలో జరిగిన బొబ్బిలియుద్ధంలో అటు బొబ్బిలి వంశం , ఇటు విజయనగర రాజులు ఇరువురు హతమైనప్పుడు విజయనగర రాజు అయినటువంటి విజయరామరాజు సోదరి పైడిమాంబ తమ రాజ్యం ఫ్రెంచ్ వారి హస్తగతం అవ్వడం ఇష్టపడక పరాయి రాజ్యం లో తను జీవించటానికి మనసును చంపుకొని, జీవించలేక తను నిత్యం ఆరాదించే విజయవాడ కనకదుర్గ లో కలిసిపోయి విజయనగరంలోని పెద్ద చెరువులో బంగారు విగ్రహరూపంలో వెలసింది. నాటి నుండి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రజలు ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటుంది.
ఆ రోజు నుండి విజయనగరం సంస్థానంలో భక్తులు కోర్కెలను తీరుస్తూ, భక్తుల పాలిట కొంగు బంగారంగా పూజలు అందుకుంటూ దాకమర్రి నుండి కూడా ప్రతి సంవత్సరం ప్రజలు 7 పెద్ద కుటుంబాల 7 ఎడ్ల బళ్ళను అందంగా అలంకరించి ఆ తల్లికి మొక్కులు తీర్చుకోడానికి వెళ్ళి వచ్చేవారు. కాలక్రమంగా విజయనగరంలో స్వాతంత్ర్యనికి ముందు బ్రిటీష్ వారు పండగలు నిర్వహణ వలన ప్రజలలో ఐక్యమత్యం పెరుగుతుందని, తిరుగుబాట్లు జరగవచ్చని కారణంతో ప్రజల రాకపోకలు నియంత్రించారు. రాకపోకలకు ఇబ్బంది కల్గించిన కారణంతో ప్రజలు తమ మొక్కులు తీర్చుకోడానికి అనేక ఇబ్బందులకు గురి అయ్యేవారు. ఆ తల్లి కరుణ మీరు మీ మ్రొక్కులను మీ గ్రామంలో నుండి తీర్చుకోండి అని చెప్పి చైత్ర మాసంలో పౌర్ణమి ఘడియలలో సోమ , మంగళ , బుధ వారాలలో మీ 7 బళ్ళను రధాలుగా మీ ఊరు చుట్టూ ప్రదక్షణగా ఊరి మధ్యలో గుడి కట్టి ఊరికి నైరుతిన శక్తి పీటం (సదురు) (వనం గుడిని) మీ స్థాయిలో ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం ఉత్సవాలు నిర్వహించుకోవచ్చు అని ఆనతిని ఇవ్వగా నాటి నుండి ఊరు జమిందారులు అయిన నాయిడోరు ఆధ్వర్యంలో పండుగలు జరుగగా 7 పెద్ద కుటుంబాలు సమక్షంలోని
1 కాళ్ళ
పండగ లో మొదటి ఘటం , మొదటి రధం , మొదట బాలి ఇచ్చే పోతూ ఇలా అన్ని సందర్బాలలో మొదటిది కాళ్ళ వారిదే కావడం విశేషం.
2 మొకర
3 కంటుభుక్త + బక్క
4 రంగుబుక్త
5 సంకురుభుక్త
6 కంటుభుక్త
7 ముద్దాడ
రధాలను వేరు వేరు రూపాలలో అలంకరించి ఆ తల్లికి తమ మొక్కులను తీర్చుకొని ఆ తల్లి తీర్ధ ప్రసాదాలను భక్తులకు అందించి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి పండుగ 30 రోజులు ముందుగ చాటింపు వేసి, 15 రోజులు ముందుగా వనం గుడికి భక్తులు ఊరేగింపుగా వెళ్ళి దివిటీల వెలుగులో అమ్మవారిని ఊరేగింపుగా భక్తులు ప్రధాన ఆలయానికి తీసుకొని వస్తారు. అమ్మ వారు ఉగాది పండగ రోజున పంచగా శ్రవణం చేసిన తర్వాత భక్తులను తరింపచేయడానికి వంది మగాదులు వెంట పెట్టుకొని ఊరేగింపుగా దాకమర్రి గ్రామ అనుబంద గ్రామాలకు జోగిగా వెళ్ళి పాడిపంటలను, పిల్లలను నాడు దుర్గలో ఐక్యం కాక మునుపు పైడిమాంబ నడియాడిన ప్రదేశాలను ఆమెకు చూపిస్తూ సాయంత్రానికి సతకం (రచ్చబండ) వద్దకు చేరి ప్రజలు వారు ప్రవర్తిస్తున్న తీరుపై వాలకాలు వ్యంగ్యంగా విమర్శలు ఉంటాయి. ఈ విధంగా పౌర్ణమి దగ్గరి సోమవారం తోలెలు (అనగా మొదటి పూజను) 7 రధాలను ఒక్కసారి తిప్పి నిర్వహణ చేస్తారు. రెండవ రోజైన మంగళవారం ప్రధాన పూజను నిర్వహించి సాయంత్రం ప్రజలు ఘటాలతో పాటు, 7 రధాలు (3 సార్లు ) , పాలధార (సైన్యం)తో ఊరు మొత్తం తిరిగి ప్రధాన ఆలయంకు చేరుస్తారు. తదుపరి 15 రోజులు తరువాత అమ్మవారి అనుపు (ఉయ్యాల కంబాల) నిర్వహణతో పండగ ముగుస్తుంది.
గత 20 ఏళ్ళుగా పండుగను నాయిడోరుతో పాటు గ్రామ పెద్దగా ఉన్న చెల్లూరి పైడప్పడు గారు కలిసి నిర్వహిస్తున్నారు.
నాటి నుండి పండుగను నేటి వరకు ప్రజలు తమ జీవనార్ధం ఎచ్చటకు వెళ్ళిన ఆ మూడు రోజులు తమ ఇళ్ళకు వచ్చి భక్తి శ్రద్ధలతో , ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకుంటారు.